పల్లె వెలుగు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ

పల్లె వెలుగు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ

రాష్ట్రంలో పల్లె వెలుగు బస్సు చార్జీల రేషనలైజేషన్ పేరుతో ఆర్టీసీ భారీగా టికెట్ రేట్లు పెంచింది. రౌండ్ ఫిగర్ పేరుతో టికెట్ రేట్లలో మార్పులు చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం.. కొత్త చార్జీలు నేటి నుంచే అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. పల్లె వెలుగు బస్సుల్లో టిక్కెట్లపై ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ చార్జీలు లేవు. ఇక నుంచి రూ.10, 15, 20, 30, 40,50, 100 చొప్పున వసూలు చేయనున్నారు.  ప్రస్తుతం రూ.13 ఉన్న చార్జీని 15, అలాగే 38 రూపాయలుంటే రూ.40 వసూలు చేయనున్నారు. అయితే చార్జీ రూ.17 ఉంటే.. రూ.15, రూ.21 ఉంటే 20 రూపాయలకు టిక్కెట్ రేట్లను తగ్గించారు.

మరిన్ని వార్తల కోసం..

నమామి గంగా తరహాలో మూసీ నదిని క్లీన్ చేయాలే 

111జీవో రద్దు ఎందుకోసం.. ఎవరి కోసం?

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్