గుడ్ న్యూస్ : ఏప్రిల్ 25 వరకు మండే ఎండలు లేవు.. కూల్ వెదర్

గుడ్ న్యూస్ : ఏప్రిల్ 25 వరకు మండే ఎండలు లేవు.. కూల్ వెదర్

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 10 రోజులు అంటే.. ఏప్రిల్ 25వ తేదీ వరకు మండే ఎండలు ఉండవని.. నిప్పులు కక్కే ఎండలు ఉండవని.. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలోనే మండిపోయే ఎండలను చూసిన తెలంగాణ జనం.. నాలుగు రోజులుగా అక్కడక్కడ పడుతున్న చిరుజల్లులతో సేదతీరుతున్నారు. ఇదే వాతావరణం మరో పది రోజులు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ.

తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 25 వరకు వేడిగాలులు ఉండవని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఏప్రిల్ 15 వరకు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

రాజస్థాన్ పై నైరుతి రుతుపవనాలు తుఫాన్ గా మరి కోస్తా కర్ణాటక వరకు విస్తరించి ఉన్నాయని ఈ క్రమంలోనే రాబోయే ఐదు రోజుల్లో హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.