ప్రపంచమంతటికీ తెలంగాణ బ్రాండ్ ఫుడ్‌‌‌‌

ప్రపంచమంతటికీ తెలంగాణ బ్రాండ్ ఫుడ్‌‌‌‌

విలేజ్ యూత్ కు మరిన్ని ఉపాధి అవకాశాలు

నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు

ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ పాలసీపై చర్చలో మంత్రులు

కేటీఆర్ కో ఆర్డినేటర్ గా ప్రగతి భవన్‌‌‌‌లో 8 గంటలు భేటీ

హైదరాబాద్‌, వెలుగు: ప్రపంచమంతటికీ తెలంగాణ బ్రాండ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ ఎగుమతయ్యేలా ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ పాలసీ ఉండాలని రాష్ట్ర మంత్రి వర్గం సూచించింది. పౌల్ట్రీ, మీట్‌‌‌‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌‌‌‌ సెక్టార్లలో గ్రామీణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ పాలసీల రూపకల్పనపై సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాల మేరకు ప్రగతి భవన్‌‌‌‌లో బుధవారం మంత్రులంతా సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్‌‌‌‌ ఈ మీటింగ్‌‌‌‌కు కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు.

ప్రత్యేక రాయితీలు ఇస్తం : కేటీఆర్

ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ పాలసీలో భాగంగా ఊళ్లలో చిన్న యూనిట్లు మొదలుకొని భారీ పరిశ్రమల వరకు ఏర్పాటు చేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఊళ్లలో స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించి యూనిట్ల స్థా పనకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టు ల ద్వారా అందుబాటులోకి వచ్చిన నీటితో మత్స్య, మాంస, పాడి పరిశ్రమలు మరిన్ని అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం ఆదేశాలతో ఏ జిల్లాలో ఏ పంటలు సాగు చేస్తున్నారో ఇప్పటికే మ్యాపింగ్‌‌‌‌ చేశారని వివరించారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, పప్పులు, సుగంధ ద్రవ్యాల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్ల స్థాపనతో ఇక్కడి పంటలకు మంచి ధర రావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ ఇండస్ట్రీల పనితీరు, వాటికి అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రోత్సాహకాలను పరిశీలిం చామని కేటీఆర్ చెప్పారు. వాటికన్నా మెరుగైన రాయితీలు కల్పించి నాణ్యమైన ఆహార ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యమన్నారు.

సరిపడా మ్యాన్ పవర్ లేదు: మంత్రులు

సమావేశంలో పాల్గొ న్న మంత్రులు మాట్లాడుతూ.. చాలా వరకు యూనిట్లలో మ్యాన్‌‌‌‌ పవర్‌‌‌‌ సరిపడా అందుబాటులో లేదని, మెకనైజేషన్‌‌‌‌తోనే ఈ సమస్యను అదిగమించవచ్చని చెప్పారు. ట్రైబల్‌‌‌‌ ఏరియాల్లో చిన్న తరహా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. పాలు, పాల ఉత్పత్తులకు విస్తృ తంగా మార్కెటింగ్‌‌‌‌ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తి పెం చడంతోపాటు ప్రాసెస్ చేసే మిల్లులను ఎక్కు వగా ఏర్పాటు చేయాలన్నా రు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్ల స్థాపనతో రైతులకు ఎక్కువ లాభం వస్తుందని, వేస్టేజీ కూడా తగ్గుతుందని వివరించారు. అన్ని శాఖల మంత్రులు, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు ఎనిమిది గంటలపాటు మీటింగ్ జరిగింది.