ఐటీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో..శ్రీజ @40

ఐటీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో..శ్రీజ @40

న్యూఢిల్లీ : తెలంగాణ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆకుల శ్రీజ.. ఐటీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో 40వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. శ్రీజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. మెన్స్‌‌‌‌‌‌‌‌లో శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌ 35వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, సత్యన్‌‌‌‌‌‌‌‌ 60వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. మానవ్‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌ (63), హర్మీత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ (67) టాప్‌‌‌‌‌‌‌‌–100లో చోటు సంపాదించారు.  

మరోవైపు పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో శ్రీజ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ కోసం చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ వెళ్లనుంది. ఇందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను మిషన్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ఆమోదించింది. 12 రోజుల పాటు కోచ్‌‌‌‌‌‌‌‌ లియు జున్‌‌‌‌‌‌‌‌ లిన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో శ్రీజ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ తీసుకోనుంది.