కాళేశ్వరంలో అక్రమాలు గుర్తించినం

కాళేశ్వరంలో అక్రమాలు గుర్తించినం
  • సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించే యోచనలో ప్రభుత్వం
  • హైకోర్టుకు వెల్లడించిన అడ్వొకేట్‌‌ జనరల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలను గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. బాధ్యులపై ఇప్పటికే చర్యలు చేపట్టామని నివేదించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు, కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తుకు విజిలెన్స్‌‌ కమిషన్‌‌  వేశామని తెలిపింది. ఆ విచారణతోపాటు నేష నల్‌‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందని వివరించింది. విజిలెన్స్‌‌ ప్రాథమిక రిపోర్టు ఆధారంగా బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించామ ని తెలిపింది.

తుది నివేదిక వచ్చాక తదుపరి చర్యలు  తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌‌  కమిషన్‌‌  ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అడ్వొకేట్‌‌ జనరల్‌‌  సుదర్శన్‌‌ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై జయశంకర్‌‌  భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌  పోలీసు స్టేషన్‌‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చే యాలంటూ కాంగ్రెస్‌‌ ఎలక్షన్‌‌  కమిషన్‌‌  కోఆర్డినేషన్‌‌  కమిటీ సీనియర్‌‌  ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌‌  వేసిన పిల్‌‌  దాఖలుకు నంబరు  

కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చీఫ్‌‌  జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌  జె.అనిల్‌‌  కుమార్​తో కూ డిన బెంచ్​ సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల వేళ ఇలాంటి పిల్స్‌‌  దాఖలు అవుతూ ఉంటాయని, 2016లో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెడితే ఇప్పటి వర కు ఏం చేశారని పిటిషనర్‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఇదేమీ ప్రచారం కోసం వేసిన పిల్‌‌  కాదని పిటిషనర్‌‌  అడ్వొకేట్  చెప్పారు. ఏజీ వాదిస్తూ.. ఇప్పటికే విజిలెన్స్‌‌  ఎంక్వయిరీ మొదలైందని చెప్పారు. గత అక్టోబరు 24, 25వ తేదీల్లో నేషనల్‌‌  డ్యాం సేఫ్టీ  అథారిటీ ప్రాజెక్టును

సందర్శించి ప్రాథమిక దర్యాప్తు చేసిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, ఆపరేషన్స్‌‌  నిర్వహణపై నేషనల్‌‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న లేఖ రాసిందని ఏజీ పేర్కొన్నారు. తనిఖీ అధ్యయనం నిర్వహించాలన్న ప్రభుత్వ వినతిపై నేషనల్‌‌  డ్యాం సేఫ్టీ అథారిటీ ఈనెల 1న ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఏజీ వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని విచారణను 4 నెలలకు వాయిదా వేసింది.