
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
కాసేపట్లో సెక్రటేరియట్ లో కేసీఆర్ జెండా ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ఆవతరణ దశాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. రాజ్ భవన్ లో వేడుకలను గవర్నర్ తమిళి సై ప్రారంభించనున్నారు. ఇక విపక్ష పార్టీలు ఎవరిక వారే వేడుకలను నిర్వహిస్తున్నారు.