సంఘటితమై పోరాడితేనే డిమాండ్లను సాధించుకోగలుగుతాం

సంఘటితమై పోరాడితేనే డిమాండ్లను సాధించుకోగలుగుతాం

సంగారెడ్డి టౌన్ : సంఘటితమై పోరాడితేనే డిమాండ్లను సాధించుకోగలుగుతామని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపు మలిశెట్టి సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మలిశెట్టిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల కాపరులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు, చట్టసభల్లో సత్తా చాటేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

‘దళిత బంధు’ తరహాలోనే గొర్రెల కాపరులకు కూడా గొర్రెలు కొనేందుకు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కొత్త కమిటీని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా తొంట అంజయ్య, జిల్లా అధ్యక్షుడి గా బడంపేట మల్లేశం ,ఉపాధ్యక్షులుగా గోవింద్, ఏ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి గా పురా నారాయణ,కార్యదర్శిగా శివలింగం, సభ్యులను ఎన్నికయ్యారు. రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, గాలయ్య, మల్లికార్జున్ పాల్గొన్నారు.