9 ఏoడ్లల్లో 300 శాతం పెరిగిన పన్నులు

 9 ఏoడ్లల్లో 300 శాతం పెరిగిన పన్నులు

కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్లలో అన్ని రకాల పన్నులను 300 శాతం పెంచింది. ప్రభుత్వ భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు అమ్మేసింది. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను అగ్గువకు లీజుకి ఇచ్చింది. ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా ఉందంటూ పంచరంగుల వన్నెలతో పబ్లిసిటీ ఇచ్చేందుకు ప్రకటనల కోసం వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నది. ఓడిపోయిన, పదవులు లభించని నాయకులు, అవినీతి, రిటైర్డ్ ఉన్నతాధికారులను సలహాదారులుగా నియమించుకొని వారి జీతభత్యాలు, రకరకాల వసతుల కోసం ఏటా 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నది. 2023–24 బడ్జెట్ 2లక్షల 90 వేల కోట్ల రూపాయలు. వాస్తవానికి అందులో 90 వేల కోట్ల రూపాయలు ఉతుత్తదే.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునే అప్పులను అధికంగా చూపిస్తోంది. బడ్జెట్ ను పెంచి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రణాళిక మండలిలో ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు, ప్రణాళిక మండలి చైర్మన్ చంద్రశేఖర రావు, వైస్ చైర్మన్ వినోద రావు(ముగ్గురు బంధువులే) తప్ప ఇంకొకరికి స్థానమే లేదు. ఈ తొమ్మిదేండ్లలో వీరు రాష్ట్రానికి సంబంధించి ఒక్క ముసాయిదా ప్రణాళిక కూడా తయారు చేయలేకపోయారు.

-ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ