Good Story : తెలంగాణలోని ఈ ఊరంతా డ్రైవర్లే.. అద్భుతం కదా..

Good Story : తెలంగాణలోని ఈ ఊరంతా డ్రైవర్లే.. అద్భుతం కదా..

ఆ ఊళ్లో ఎవరినైనా కదిలిస్తే.. అన్న లారీ డ్రైవర్, తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్, నాన్న బస్సు డ్రైవర్.. ఇలా చెప్తుంటారు. ఎందుకంటే గోరింటాలలో వందమందికిపైగా డ్రైవర్లే ఉన్నారు. అందులో కొంతమంది ఆర్టీసీలోనూ పని చేస్తున్నారు. అయితే.. వాళ్లు డ్రైవర్లుగా మారడం వెనక పెద్ద కథే ఉంది.

గోరింటాల జనాభా 2,510. ఓటర్లు 1,570 మంది. ఆ ఊళ్లో వంద మందికి పైగా డ్రైవర్లున్నారు. 16 మంది టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్నారు. గోరింటాల పరిసర గ్రామాల్లో రైతులు ఎక్కువగా చెరకు సాగు చేస్తుండే వాళ్లు. అయితే దాని నుంచి తీసిన బెల్లాన్ని కామారెడ్డి, నిజామాబాద్ తీసుకెళ్లి అమ్మేవాళ్లు.

Also read : RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర సర్కార్

కొన్నిసార్లు వ్యాపారులే గోరింటాలకు వచ్చి కొని తీసుకెళ్లేవాళ్లు. అయితే.. బెల్లం, చెరుకు, కట్టెలను లారీలు, ట్రాక్టర్లలో రవాణా చేసేవాళ్లు. కానీ, సరిపడా డ్రైవర్లు ఉండేవాళ్లు కాదు. వెహికిల్స్ కు కూడా బాగానే డిమాండ్ ఉండేది. అది గమనించిన గోరింటాల గ్రామస్తుడు దండవేణి నర్సయ్య ఒక లారీ కొన్నాడు. దానికి బొంబోతుల రాజాగౌడ న్ను డ్రైవర్ గా పెట్టుకున్నాడు. రాజాగౌడ్ మరో ఇరవైమందికి నేర్పించారు. ఇలా ఆ ఊరంతా డ్రైవర్లుగా డ్రైవింగ్ నేర్పించాడు. వాళ్లు మరికొంతమంది మారారు.

డ్రైవర్ కావాలంటే..

డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ముందుగా లారీలో క్లీనర్ గా పనిచేయాలి. ఈ ఊళ్లో ఉన్న డ్రైవర్లంతా ముందు క్లీనర్లుగా పని చేసినవాళ్లే. కట్టె నింపడానికి, బెల్లాన్ని లారీలోకి ఎక్కించడానికి, దింపడానికి కూలీలుగా వెళ్లేవాళ్లు. అందులో కొందరికి క్లీనర్ అవకాశం దక్కేది. తర్వాత డ్రైవింగ్ నేర్చుకునేవాళ్లు. ఇలా నేర్చుకున్నవాళ్లే చాలామంది ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించారు.