
సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్ లో ఉన్నట్లు తెలిపింది కేంద్రం. సైబర్ క్రైమ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. 2 నెలల్లో తెలంగాణ నుంచి 2 వేల 513 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది కేంద్రం. సగటున రోజుకూ 40 మంది.... లక్షల్లో నష్టపోతున్నట్లు తెలిపింది. అత్యధికంగా సైబరాబాద్ నుంచి 1047 మంది ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి 358 మంది, రాచకొడ నుంచి 359 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 749 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.