తెలంగాణ తిరుపతి: పేదల తిరుపతి.. మన్యం కొండ.. 6 శతాబ్దాల చరిత్ర గుడి.. ఎక్కడంటే..!

తెలంగాణ తిరుపతి:  పేదల తిరుపతి.. మన్యం కొండ..  6 శతాబ్దాల చరిత్ర గుడి.. ఎక్కడంటే..!

తెలంగాణ తిరుపతి.. కలియుగ వైకుంఠం, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం. తిరుపతి వెళ్లలేని వాళ్లు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే.. తిరుపతికి వెళ్లిన పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం.. 

మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా.. దిగువ కొండపై అలమేలు మంగతాయారు కొలువుదీరింది. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందున మునులకొండ అనే పేరు వచ్చింది. అదే కాల క్రమేణా మన్యంకొండగా మారింది. 

సుమారు 600 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం.. లాంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గాంచింది. హనుమద్దాసులు వేంకటేశ్వర స్వామికి సంబంధించి దాదాపు మూడు వందల కీర్తనలు రచించారు.

 గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకునే వాళ్లు. అంతేకాకుండా స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని స్థల పురాణం ద్వారాతెలుస్తుంది. 

 ఇక్కడ ప్రతి శనివారం తిరుచ్చి సేవ, ప్రతి పౌర్ణమిణి స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా  నిర్వహి స్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు.. స్వామివారికి కొత్తకుండలో అన్నం, పచ్చి పులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసరులతో పూజలు చేయించి... ఆపై నివేదిస్తారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఆలయ కమిటీ ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు నిర్వ హిస్తోంది. ఇళహరి వంశీయులు స్వామివారికి సేవలు చేయడం అనవాయితీ. పదిహేను రోజుల పాటు సాగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. స్వామి వారి దర్శనం కోసం పలు రాష్ట్రాల నుంచి తిరుమలకు వెళ్లే సోమత లేని వా... మన్యంకొండలో వెలసిన శ్రీలక్ష్మీ వెంక టేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చు కుంటారు. అందుకే ఈ కొండ పేదల తిరుపతిగా పేరుగాంచింది.

స్థల పురాణం

శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానానికి 58 ఏళ్ల చరిత్ర ఉంది. 1937లో అప్పటి నైజాం సర్కార్ దేవస్థానం నిర్మాణానికి దిగువ కొండ వద్ద 42 ఎకరాల స్థలం కేటాయించింది. అంతే కాకుండా అళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మ వారికి తిరుపతి మాదిరి ఆలయాన్ని దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించాడు. దీంతో 1957-58 సంవత్సరం లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత కోనేరు, మంచినీటి బావి కూడా నిర్మించాడు.

నిత్య  కల్యాణం

మన్యంకొండ దిగువ కొండ వద్ద  అలవేలు  మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది పెళ్లిళ్లు బరుగుతా యి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.  అందుకే పెళ్లి కావల్సిన వాళ్లు .. సంతానం లేని వాళ్లు.. అలవేలు మంగమ్మ సన్నిధిలో ముడుపులు కడుతుంటారు. 

దేవస్థానం చరిత్ర

దాదాపు 600 సంవత్సరాం క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోని కాళహరి గ్రామానికి చెందిన అళహరి కేశవయ్యడు శ్రీనివాసుడు కలలో కనిపించి కృష్ణానది తీ రప్రాంతంలో ఉండే 'మస్యలకొండపై నేను వెలిసి ఉన్నా...  నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించాడట. దీంతో ఆళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో ఉంటూ.. గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి  నమస్కరించి దోసిళ్లతో నీళ్లు (అర్ఘ్యం) వదులుతున్నపుడు..చెక్కని శిలారూపం లో వెంకటేశ్వరస్వామి ప్రతిమ అలల్లో కేశవయ్యకు కనిపించింది.ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన కేశవయ్య మన్యంకొండపై శేషశాయి రూపంలో ఉన్న గుహలో ప్రతి ష్టించి.. ప్రతిరోజు రూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించాడు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆం జనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.

చక్కని వాతావరణం

ఎత్తైన గుట్టలు, పచ్చని చెట్లు, వివిధ రకాల పక్షులు, ప్రశాంత వాతావరణం, గుట్టపై నుంచి వచ్చే ఓంకారనాదం. భక్తులను పరవశింప చేస్తాయి. కొండ చిన్నదైనా ఒకవైపు మెట్లు, మరోవైపు ఘాట్ రోడ్డు ఉంది. తిరుమలలో ఏడుద్వారాలు దాటి వెంకటేశ్వరుడిని ఎలా. దర్శించుకుంటామో.. ఇక్కడ కూడా. ఏడు ద్వారాలు దాటాలి. గుహలోని ఆదిశేషుని పడగ నీడలో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి.

ఎలా వెళ్లాలంటే..

  • హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఆర్టీసీ బస్సులున్నాయి. 
  • కర్నూలు నుంచి వచ్చే భక్తులు జెడ్చర్లలో దిగి మహబూబ్ నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. 
  • మరో మార్గంలో భూత్పూర్ లో దిగితే మహబూబ్​నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు.   
  • రైలులో రావాలంటే మహబూబ్ నగర్ దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగాలి అక్కడి నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.