రేవంత్​ సర్కార్​ కీలక నిర్ణయం... రవాణాశాఖ ప్రక్షాళన 

రేవంత్​ సర్కార్​ కీలక నిర్ణయం... రవాణాశాఖ ప్రక్షాళన 

ప్రభుత్వాలు మారితే చాలు.. అధికారులకు స్థాన చలనం తప్పడం లేదు.  గత ప్రభుత్వాలు చేసిన పద్దతినే... ఇప్పుడు కూడా అవలంభిస్తున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడిన తరువాత ఐఏఎస్​, ఐపీఎస్​ లను బదిలీ చేసింది.  ఇప్పుడు రవాణాశాఖను ప్రక్షాళన చేసిదిశగా రేవంత్​ సర్కార్​ అడుగులు వేసింది.  ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖలోని ప్రతి అధికారిని బదిలీ చేయాలని ప్రత్యేక జీవో విడుదల చేసింది.  అన్ని స్థాయిల అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు), 23 మంది  రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌(ఆర్టీవో), ఏడుగురు  డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) సహా ఇతర సిబ్బందిని బదిలీ చేసింది.