ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చెయ్యాలి : లోకిని రాజు

ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చెయ్యాలి : లోకిని రాజు
  • ఆదివాసీ గిరిజన సంఘాల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో తక్షణమే ప్రత్యేక ఎస్టీ కమిషన్​ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ట్యాంక్ బండ్​లోని​కుమ్రం భీమ్ విగ్రహం వద్ద తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, గిరిజన ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమంనిర్వహించారు. 

కుమ్రం భీం వర్ధంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్​చేశారు. ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.