TS కాదు TG.. నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా.. ప్రచారంలో నిజమెంత..?

TS కాదు TG.. నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా.. ప్రచారంలో నిజమెంత..?

తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్పులు చేసింది. తెలంగాణ స్టేట్ కాదు.. తెలంగాణ గవర్నమెంట్ గా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు టీఎస్.. ఇక నుంచి టీజీ అవుతుందని స్పష్టం చేసింది. ఈ మార్పుతో అందరికీ వస్తు్న్న ఓ డౌట్ ఉంది.. అదే నెంబర్లు ప్లేట్లు అన్నీ మార్చుకోవాలా అని.. ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది.

ఇప్పటి వరకు ఉన్న అనధికారిక సమాచారం మేరకు టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత.. అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ కేటాయిస్తారు. ఏపీ పోయి.. టీఎస్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాల నెంబర్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవి యధావిధిగా కొనసాగుతాయి. కొత్తగా వచ్చిన వాహనాలకు మాత్రమే టీజీ కేటాయిస్తారు అనేది అధికారుల వెర్షన్. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే పద్దతి కొనసాగింది. అప్పటి వరకు ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగాయి. ఇప్పుడు కూడా అంతే అంటున్నారు కొందరు అధికారులు. ప్రభుత్వం జీవో వచ్చిన తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే టీజీ ఉంటుంది. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్ పేరుతో ఉన్న వాహనాల నెంబర్లు ప్లేట్లు మార్చాలి పెద్ద తలనొప్పిగా మారుతుందని.. కొన్ని లక్షల వాహనాలు ఉంటాయని.. అవన్నీ మార్చాలంటే కష్టం అంటున్నారు. 

ప్రస్తుతానికి అయితే టీఎస్ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరం లేదనేది కొందరు అధికారుల మాట.. బయట ప్రచారం జరుగుతున్నట్లు టీఎస్ నెంబర్ ప్లేట్లను టీజీ మార్చుకోవాల్సిన అవసరం లేదు.. మార్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది అంటే.. అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారని.. అప్పటి వరకు వాహనదారులు ఎవరూ తమ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.