వర్ధన్నపేటలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేటలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు  : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: అర్హులందరికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందజేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్, ఐనవోలు రైతువేదికలో 147 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

 కార్యక్రమంలో ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, తహసీల్దార్​ విక్రమ్, ఎంపీడీవో నర్మద, పార్టీ మండలాధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు యాకర సాంబయ్య, నాయకులు పాల్గొన్నారు.