హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యువ అథ్లెట్ అగసార నందిని నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో డబుల్ ధమాకా మోగించింది. గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో సత్తా చాటింది. గుజరాత్ నడియాడ్‌లో శుక్రవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లో 13.97 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్ సాధించింది. గోల్డ్ మెడల్‌తో పాటు వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు కూడా క్వాలిఫై అయ్యింది. ఈ మెగా టోర్నీ కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరుగుతుంది. అలాగే, విమెన్స్ లాంగ్‌జంప్‌లో 5.92 మీటర్లు దూకిన నందిని సిల్వర్ గెలిచి రెండో మెడల్ ఖాతాలో వేసుకుంది. నైరోబి వేదికగా గతేడాది జరిగిన వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో కూడా నందిని పోటీ పడింది. 100మీ. ఈవెంట్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్లింది.

