న్యూఢిల్లీ: మనదేశ టెల్కోలు 6జీ పేటెంట్లలో కనీసం పదిశాతం దక్కించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తమ వంతు సహకారం అందించాలని భావిస్తున్నాయి. కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో జరిగిన స్టేక్‌హోల్డర్స్ అడ్వైజరీ కమిటీ (ఎస్ఏసీ) మీటింగ్‌లో ఈ ప్రతిపాదన వచ్చింది.
టెల్కోల కోసమే ఈ కమిటీని నియమించారు. 6జీకి సంబంధించిన స్టాండర్డ్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు, కనెక్టివిటీ సమస్యలు, టెలికం సర్వీసుల నాణ్యత గురించి ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.