లైసెన్సు ఫీజులు తగ్గించండి..కేంద్రాన్ని కోరుతున్న టెల్కోలు

లైసెన్సు ఫీజులు తగ్గించండి..కేంద్రాన్ని కోరుతున్న టెల్కోలు

న్యూఢిల్లీ: పుట్టెడు నష్టాలతో ఇబ్బందిపడుతున్న తమను ఈ బడ్జెట్​లో ఆదుకోవాలని టెలికం కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రూ. 32 వేల కోట్ల ఇన్‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను తిరిగి చెల్లించాలని,  లైసెన్స్ ఫీజులను తగ్గించాలని రిక్వెస్ట్​ చేస్తున్నాయి..  యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌‌కు కంట్రిబ్యూషన్ వంటి లెవీలను తగ్గించాలని టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు బడ్జెట్​లో నిర్ణయాలు తీసుకోవాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కోరుతోంది.  ప్రభుత్వం తమను ఆదుకుంటే కంపెనీలను మరింత విస్తరించవచ్చని, లిక్విడిటీ  పెరుగుతుందని తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్  5జీని వేగంగా విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులను సులభతరం చేయడం కోసం టీఎస్​పీల (టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు)కు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీనివల్ల టారిఫ్​లు జనానికి అందుబాటులో ఉంటాయని సీఓఏఐ వివరించింది. ప్రస్తుతం, లైసెన్స్ ఫీజు అడ్జెస్టెడ్‌​ గ్రాస్​ రెవెన్యూ (ఏజీఆర్​)లో 8శాతం ఉంది. ఇందులో 5శాతం మొత్తాన్ని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌‌కు కేటాయిస్తారు.  ప్రతి రూ.100లో రూ.30కి పైగా ప్రభుత్వానికి లెవీల రూపంలో చెల్లిస్తున్నట్లు టెల్కోలు చెబుతున్నాయి.  లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ (ఎస్​యూసీ), స్పెక్ట్రమ్ చెల్లింపులపై జీఎస్టీని తొలగించే ప్రతిపాదనలను త్వరలో టెలికాం శాఖకు పంపనున్న బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని కోరింది. టెలికాం టవర్​కు ​ఇన్‌‌స్టాల్ అయిన టెలికాం పరికరాలపై ఇన్‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్​కు సంబంధించి కూడా స్పష్టత కావాలని సీఓఏఐ కోరుతోంది.  "పన్నుపై పన్ను"ను నివారించడానికి ఇన్‌‌పుట్ టాక్స్ క్రెడిట్ ఒక మెకానిజం.  ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణల్లో భాగంగా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రస్తుత సంవత్సరం సెప్టెంబరులో ఈ టెలికం రంగానికి రిలీఫ్​ ప్యాకేజీ ప్రకటించారు.  స్పెక్ట్రమ్,  ఏజీఆర్​ బకాయిలను నాలుగు సంవత్సరాలపాటు వాయిదా వేయడానికి అనుమతి ఇచ్చారు. టెల్కోలు బకాయిపడ్డ వడ్డీని ప్రభుత్వ ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారు.  ఏజీఆర్ నిర్వచనాన్ని మార్చారు. లైసెన్స్ ఫీజులు, ఎస్​యూసీ వంటి రెగ్యులేటరీ లెవీలు ఏజీఆర్​ ఆధారంగా క్వార్టర్​కు ఒకసారి చెల్లించడానికి అనుమతించారు. తక్కువ ఏజీఆర్​ అంటే టెల్కోలు తక్కువ లెవీలు చెల్లిస్తాయి. 2021 తెచ్చిన సంస్కరణల్లో భాగంగా భవిష్యత్తులో స్పెక్ట్రమ్ వేలంలో పొందే ఎయిర్‌‌వేవ్‌‌ల కోసం స్పెక్ట్రమ్ యూసేజ్​ చార్జీని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితంగా, టెల్కోల మొత్తం ఎస్​యూసీ చెల్లింపు ఏజీఆర్​లో 1శాతం కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. 

టారిఫ్స్​ తగ్గించాలని కోరిన ఐసియా

ఎలక్ట్రానిక్స్​ప్రొడక్టులపై అడ్డగోలుగా వసూలు చేస్తున్న టారిఫ్​లను, పన్నులను మార్చాలని ఎలక్ట్రానిక్స్​ ఇండస్ట్రీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మొబైల్​ ఫోన్స్​, సబ్–అసెంబ్లీస్​, మెకానిక్స్​పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఇండియా సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​అసోసియేషన్​(ఐసియా) కేంద్రాన్ని కోరింది. ఖరీదైన ఫోన్ల స్మగ్లింగ్​ను నివారించడానికి వాటిపై 20 శాతం బేసిక్​ కస్టమ్స్​ డ్యూటీని విధించాలని కోరింది. ఒక్కో డివైజ్​కు రూ.నాలుగు వేల చొప్పున వసూలు చేస్తే జీఎస్టీ వసూళ్లు అదనంగా రూ.వెయ్యి కోట్లు పెరుగుతాయని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్​ సెక్టార్‌‌లో టారిఫ్​ విధానం మార్చాలని ఐసియా కోరింది. ఎక్కువ టారిఫ్స్​ వల్ల ఎలక్ట్రానిక్స్​వస్తువుల తయారీలో వియత్నాం, థాయ్​లాండ్​, మెక్సికో వంటి దేశాలతో పోలిస్తే వెనుకబడుతున్నామంది.