
తెలుగు బుల్లితెర జంట మానస(Manasa)-ప్రియతమ్ చరణ్(Priyatham Charan) గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ జంట చాలా సీరియల్స్, టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొన్నారు. ప్రియతమ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం అతను పాపే మా జీవిన జ్యోతి అనే సీరియల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. చూడటానికి చాలా క్యూట్ కపుల్ గా కనిపించే ఈ జంట త్వరలో విడిపోతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు.
తాజాగా విడాకుల విషయంపై స్పందించారు మానస. తన యూట్యూబ్ లో సుదీర్ఘమైన వీడియో పెట్టిన ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు. ఆ అంశానికి సంబంధించి గత నాలుగు నెలలుగా నరకం అనుభవిస్తున్నాను. అయినప్పటికి నా యూట్యూబ్ ఛానెల్లో వ్లాగ్స్ చేయడం ఆపలేదు. ఎందుకంటే.. ఇప్పుడు నాకున్న ఆధారం ఈ ఛానల్ ఒక్కటే. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. అలా అని మీరు నాపై జాలీ చూపిస్తారని కూడా అనుకోవడంలేదు.
ఇది నేను చేతులారా చేసుకున్నది కాదు. మా ఇద్దరి తప్పు ఉండొచ్చు. అయినా.. మీరు అనుకుంటున్నట్లుగా మేము విడాకులు తీసుకోలేదు. తీసుకోము కూడా కానీ.. ప్రస్తుతం మేము క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు కూడా నేను స్టాండ్ తీసుకోకపోతే.. రేపు నా పిల్లల జీవితం ఏమైపోతుందోనని ఆందోళనగా ఉంది. మాకు కాస్త టైం ఇవ్వండి. అన్నీ సర్దుకుంటాయి. ప్రస్తుతం తన పని తాను, నా పని నేను చేసుకుంటున్నాము. తనను చాలా మిస్ అవుతున్నా. నా లైఫ్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని త్వరలోనే మీతో పంచుకుంటాను.. అంటూ చెప్పుకొచ్చారు మానస. ప్రస్తుతం మానస చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.