
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యింది. చాలా రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది.దీంతో ఈ షోలో పాల్గొనే వారెవరూ అనేది ఇంట్రెస్టింగ్ టాక్ అయ్యింది. అలాగే వారు ఎందులో ఫేమస్ అనే విషయాలు తెలుకోవడనికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
14 మంది కంటెస్టెంట్లు..:
1. ప్రియాంక జైన్: జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్(Priyanka Jain)..బిగ్ బాస్ హౌస్ కి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ఎంతో ఫేమస్ అయినా ప్రియాంకా..బిగ్ బాస్ కి 'పొట్టి పిల్ల పొట్టి పిల్ల' సాంగ్ తో ఎంట్రీ అవ్వడంతో షోలో హుషారు మొదలైంది. మౌనరాగం వంటి సీరియల్ తో పాటు పలు మూవీస్ లో యాక్ట్ చేసింది.
చల్తే.. చల్తే, వినరా సోదరా వీర కుమార మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. ఇక నెవర్ ఎండింగ్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది.
2. శివాజీ: టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు ఉన్న హీరో శివాజీ. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా క్రిష్ణమూర్తి, మిస్సమ్మ,తాజ్ మహల్
ఆయుధం,ప్రియమైన నీకు, ఒట్టేసి చెపుతున్నా,మంత్ర పలు మూవీస్ లో యాక్ట్ చేసి ఫేమస్ అయ్యారు. ఇక కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చేరి, సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తనదైన ఫేమ్ తెచ్చుకున్నారు.
3. దామిని భట్ల: ప్రభాస్ బాహుబలిలో ఆడియన్స్ కి ఇష్టమైన సాంగ్ పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో ఎంతో ఫేమస్ అయింది. ఇక రీసెంట్ గా కొండపొలంలో ధమ్ ధమ్ ధమ్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది.లెజెండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హోస్ట్ చేసిన జీ స రి గ మ ప ఎల్ చాంప్స్ మరియు 'పాడుతా తీయగా' వంటి పలు టెలివిజన్ షోలలో కూడా పాల్గొంది. ఇక ఎంతో ఫేమస్ అయినా పలు డిఫరెంట్ మూవీస్ తో టాలీవుడ్ లో సింగర్ రాణించింది.
4. ప్రిన్స్ యావర్ : జిమ్ లో కసరత్తులు చేస్తూ..మంచి బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకుని, పలు సీరియల్స్ తో ఫేమస్ అయ్యారు.ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో టైటిల్ పై హోప్స్ పెట్టుకున్నారు.
5. శుభశ్రీ: రుద్రవీణ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఒడిశా మోడల్ మల్టీ టాలెంటెడ్. శుభశ్రీ యాంకర్ గానూ రాణిస్తూ..లా స్టడీ కంప్లీట్ చేసింది.కొన్నాళ్ళు లాయర్ గా రాణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తోంది.శుభశ్రీ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది మరియు ముంబైలోని KV లా కాలేజీలో LLB కోర్సు చేసింది.మిస్ ఇండియా 2020 లో పాల్గొని టైటిల్ సాధించింది.
6. షకీలా: మలయాళ మూవీస్ తో పాటు, తెలుగు, తమిళం, కన్నడం ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ యాక్టర్స్ షకీలా. తనదైన మూవీస్ తో ఆడియాన్స్ ను ఆకట్టుకునేలా చేసింది. షకీలా పర్సనల్ లైఫ్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని..కేవలం మూవీస్ లో మాత్రమే రొమాంటిక్ గా కనిపిస్తానని పలు ఇంటర్వూస్ లో స్వయంగా వెల్లడించింది.
7. సందీప్ : టాలీవుడ్‌లో ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా సందీప్ రాణిస్తున్నారు.ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్‌లో విజేతగా నిలిచారు. ఇక అప్పటి నుంచి ఆట సందీప్‌గా పేరు సంపాదించుకున్నారు.
8. శోభాశెట్టి: కార్తీకదీపం మోనిత అంటే తెలియని వారు ఉండరు. కొన్ని సీరియల్స్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఈమె నేటివ్ ప్లేస్ కర్ణాటక అయినా తెలుగింటి అమ్మాయిగా సీరియల్‌లో యాక్ట్ చేసి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమెను బుల్లెటరా రమ్యకృష్ణ గా పిలుస్తుంటారు.
9: టేస్టీ తేజ: యూట్యూబర్, జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజా ఎంతో ఫేమస్ అయ్యారు. కింగ్ నాగార్జునతో తెగ కామెడీ చేశాడు. అయితే తేజ మాట్లాడిన 100 మాటల్లో 90 మాటలు ఫుడ్ గురించే ఉండటం చూసి నాగ్ కూడా షాకయ్యారు. ఇక తేజ 150 మంది సెలబ్రటీస్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.
10: రతిక రోజ్: అచ్చమైన తెలుగమ్మాయి. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్ గా ఫేమస్ అయ్యింది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో లో డ్యాన్స్ తో పాటు మిమిక్రీ కూడా చేస్తానంటూ ముందుగానే తనపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. ఇక రతిక బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో యాక్ట్ చేసింది. రీసెంట్ గా బెల్లకొండ గణేష్ బాబు నేను స్టూడెంట్ సర్ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించింది.
11. డాక్టర్ గౌతమ్ కృష్ణ: ఆకాశవీధుల్లో మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. ఇక షోలో డాక్టర్ నుంచి యాక్టర్ ఎలా అయ్యాడో చెప్పుకొచ్చాడు.
12. కిరణ్ రాథోడ్: తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఇక హీరోయిన్ రోల్స్ తగ్గడంతో ఐటెం గర్ల్‌గా రాణిస్తూ ఫేమస్ అయింది.ఇక కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యే లోపు తెలుగు నేర్చుకుంటానని తెలిపింది.
13. పల్లవి ప్రశాంత్: రైతు గా సోషల్ మీడియాలో ఎంతో ఫేమాస్ అయ్యారు. రైతు పడే ప్రతి బాధను, పండించిన పంటను కళ్ళకు చూపిస్తూ అందరికీ కనెక్ట్ అయ్యారు. ఇక ఈ షోలో కింగ్ నాగ్ ప్రశాంత్ కు ఒక ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఒక మిర్చి మొక్కను ఇచ్చి..అది పెరిగే లోపు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని..మిరపకాయలు కాస్తే కొన్ని ఆఫర్స్ ఉంటాయని తెలిపారు.
14. అమర్ దీప్: టెలివిజన్ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు ఫేమస్ అయ్యారు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక బిగ్ బాస్ లో తన టాస్క్ లతో సత్తా చాటుతానని అమర్ దీప్ తెలిపాడు.