V6 News

Telugu Thriller: వెన్నులో వణుకు పుట్టించేలా తెలుగు డార్క్ మిస్టరీ థ్రిల్లర్.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్!

Telugu Thriller: వెన్నులో వణుకు పుట్టించేలా తెలుగు డార్క్ మిస్టరీ థ్రిల్లర్.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్!

మూవీ లవర్స్ ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్ విషయానికి వస్తే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు భయానికి సరికొత్త నిర్వచనం ఇస్తూ.. వెన్నులో వణుకు పుట్టించేలా ఒక డార్క్ అండ్ డేంజరస్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. M3 మీడియా, మహా మూవీస్ కలిసి నిర్మిస్తున్న "Production No. 4" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో ఒక్కసారిగా గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది "Inspired by True Events" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. మన చుట్టూ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా హారర్ ఎలిమెంట్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.

పోస్టర్‌లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, నిగూఢమైన చిహ్నాలు సినిమాలోని మిస్టరీని కళ్లకు కడుతున్నాయి. దర్శకుడు సూర్యాస్ ఈ చిత్రాన్ని సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా మలుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. అచ్చు రాజమణి అందించే సంగీతం హారర్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేయనుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.