రివ్యూ: అశ్వథ్థామ

రివ్యూ: అశ్వథ్థామ

రన్ టైమ్: 2 గంటలు

నటీనటులు: నాగశౌర్య,మెహరీన్,జిషు సేన్ గుప్తా,సత్య,హరీష్ ఉత్తమన్,సర్గన్ కౌర్,సత్య తదితరులు

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

ఎడిటర్: గ్యారీ

స్క్రీన్ ప్లే : నాగశౌర్య

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్

నిర్మాత: ఉషా ముల్పూరి

దర్శకత్వం: రమణ తేజ

రిలీజ్ డేట్: జనవరి 31,2020

కథేంటి?

చెల్లి పెళ్లి కోసం యూ.ఎస్ నుండి వస్తాడు గణ (నాగశౌర్య) అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది.దానికి కారణం ఎవరో తెలియదంటుంది.షాక్ గురైన హీరో దానికి కారణ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో అనేక నిజాలు తెలుసుకుంటాడు.దీని వెనక ఉన్నది ఎవరు?చివరకు ఈ మిస్టరీని ఎలా చేధించాడన్నదే స్టోరి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో నాగశౌర్య బాగా చేశాడు.ఎమోషన్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.యాక్షన్ సీన్లలో కూడా ఎనర్జిటిక్ గా కనిపించాడు.హీరోయిన్ మెహరీన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.భోజ్ పురి నటుడు బిజుసేన్ గుప్తా విలనీ పాత్రలో అధ్బుతంగా నటించాడు.హీరో చెల్లి పాత్రలో కాస్త తెలిసిన వాళ్లను పెడితే ఇంపాక్ట్ బాగుండేది.సత్య,హరీష్ ఉత్తమన్,పవిత్రాలోకేష్ తదితరులు వాళ్లకు అలవాటైన పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ వర్క్:

మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.శ్రీచరణ్ పాకాల ఇచ్చిన పాటలు యావరేజ్.జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది.ఆర్ట్ వర్క్,యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైలాగులు ఇంప్రెస్ చేస్తాయి.

విశ్లేషణ:

‘‘అశ్వథ్థామ’’ ఫర్వాలేదనిపించే థ్రిల్లర్.అమ్మాయిలను వాళ్లకు తెలియకుండా వాడుకొని వదిలేసే సైకో కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడనేది కథ.కొత్త డైరెక్టర్ రమణ తేజ ఫస్టాఫ్ ను గ్రిప్పింగ్ గా నడిపాడు.పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన అన్ని పాయింట్స్ సెట్ చేసుకున్నాడు.ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ ఎపిసోడ్ లు ఎంగేజింగ్ గా అనిపస్తాయి.నాగశౌర్య కూడా ఇంటన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.అయితే సేమ్ ఫ్లో సెకండాఫ్ లో మిస్ అయ్యాడు.తద్వారా ల్యాగ్ ఎక్కువై బోర్ అనిపిస్తుంది.ఎస్పెషల్లీ క్లైమాక్స్ వీక్ గా ఉంది.కొన్ని లాజిక్స్ ను మిస్ చేశాడు డైరెక్టర్.విలన్ అంత సైకోగా ఎందుకు బిహేజ్ చేస్తాడో కన్సీన్సింగ్ గా లేదు.అయితే హీరో చెల్లికి జరిగిన అన్యాయం ప్రేక్షకులను పెద్దగా కనెక్ట్ చేయదు.ఆ పోర్షన్స్ సరిగా రాసుకోలేదు.నాగశౌర్య రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకాస్త పకడ్బందీగా ఉండాల్సింది. ఓవరాల్ గా ఈ మధ్య వచ్చిన ‘‘రాక్షసుడు’’ లాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఫర్వాలేదనిపిస్తుంది.