
గ్రేటర్ నోయిడా : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో జోరుమీదున్న తెలుగు టైటాన్స్ మరో హ్యాట్రిక్ సాధించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 31-–29తో బెంగాల్ వారియర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. స్టాండిన్ కెప్టెన్, రైడర్ విజయ్ మాలిక్ (14 పాయింట్లు) సూపర్ టెన్‌తో సత్తా చాటాడు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ (9) రాణించాడు. మొత్తంగా12 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం అందుకున్న టైటాన్స్ 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.