స్టేషనులో పంచకట్టులో తిరుగుతున్న పోలీసులు

స్టేషనులో పంచకట్టులో తిరుగుతున్న పోలీసులు

దసరా పండుగ అంటే పోలీసుల పండుగ అంటారు.  దసరా  రోజున పోలీసుల ఆయుధాలకు పూజ చేస్తారు.  అయితే నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు నయా ట్రెండ్ సృష్టించారు.  విజయదశమి పండుగ సందర్భంగా ఆత్మకూరు పోలీసులు తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేశారు. పంచకట్టు వస్త్రధారణ.. పైన కండువా వేసుకొని అందరినీ ఆకట్టుకున్నారు. 

హైటెక్ యుగంలో యూత్ తెలుగు సంప్రదాయాలను మర్చిపోతున్నారని మన సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.  అయితే పోలీసులు శాస్త్రం ప్రకారంగా విజయదశమి వేడుకలు జరుపుకోవడంతో ఆత్మకూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.  ఆత్మకూరు డిఎస్పీ తో పాటు, సీఐ నాగభూషణ్, ఎస్సైలు కృష్ణమూర్తి,  నారాయణరెడ్డి పలువురు కానిస్టేబుళ్లు. తెల్ల చొక్కా తెల్ల లుంగి ధరించి తెలుగు సంప్రదాయ పద్ధతిని పట్టణ ప్రజలకు గుర్తు చేశారు..