తెలుగు వర్సిటీలో పలు కోర్సులకు దరఖాస్తులు

తెలుగు వర్సిటీలో పలు కోర్సులకు దరఖాస్తులు

హైదరాబాద్ : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కు దరఖాస్తులు కోరుతోంది.ఇందుకుగాను ఏటా నిర్వహించే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఎస్‌‌‌‌టీయూసెట్-2019) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఎఫ్‌‌‌‌ఏ (శిల్పం /చిత్ర లేఖనం/ ప్రింట్ మేకింగ్ ), ఎంఏ (అనువర్తిత భాషా శాస్ర్తం/ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం/ జోతిష్యం /కర్ణాటక సంగీతం), ఎంపీఏ (కూచిపూడి నృత్యం /ఆంధ్రనాట్యం /రంగస్థల కళలు, జానపద కళలు) ఎంఏ (తెలుగు/ చరిత్ర/పురావస్తు శాస్త్రం), డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎం.ఫిల్, పీహెచ్‌‌‌‌డీ మొదలైన కోర్సులు ఉన్నాయి.

అర్హత: కోర్సును బట్టి ఆయా విభాగాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫీజు: రూ.350 సెలెక్షన్ ప్రాసెస్ : కామన్ ఎంట్రన్స్ టెస్ట్​ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం, వరంగల్, కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్ ల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తుకు చివరితేది: 2019 జూన్ 22 (రూ.100 ఆలస్య రుసు ముతో జూన్ 29) వెబ్‌ సైట్: www.pstucet.org