
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా జట్టు కోసం అసాధారంగా పోరాడాడు. ప్రతి ఒక్కరికీ మార్కరం అద్భుత సెంచరీ కనబడినా.. బవుమా కష్టం ఎవరికీ తెలియలేదు. మూడోయ్ రోజు ఆటలో భాగంగా మార్కరంతో కలిసి అజేయంగా 143 రన్స్ జోడించి జట్టు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 121 బంతుల్లో 5 ఫోర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ సఫారీ కెప్టెన్ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించడం ఆకట్టుకుంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోకాలి పై భాగంలో బవుమాకు గాయమైంది.
పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కుంటుకుంటూనే పరుగు తీశాడు. ఎంతో పట్టుదలగా బ్యాటింగ్ చేసి కెప్టెన్ ను అసలైన నిర్వచనంలా మారాడు. ఒకానొక దశలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి రిటైర్డ్ హర్ట్ అవ్వాల్సిందిగా సూచించినా వినకుండా మొండిగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో రోజు బవుమా బ్యాటింగ్ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే బవుమా నాలుగో రోజు కూడా బ్యాటింగ్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చి పరుగులు చేయడం కష్టం. పిచ్ ను బాగా అర్ధం చేసుకున్న బవుమా.. మార్కరంతో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
►ALSO READ | WTC FINAL 2025: మార్కరం బ్యాటింగ్ నాకు సంతోషాన్నిస్తుంది: కోహ్లీ ట్వీట్ వైరల్
కెప్టెన్ గా అద్భుత వ్యూహాలతో దెబ్బ కొట్టిన ఈ సౌతాఫ్రికా సారధి.. బ్యాటింగ్ లోనూ ఆస్ట్రేలియాకు నిరాశ కలిగించాడు. ముల్డర్ ఔట్ కావడంతో బ్యాటింగ్ కు దిగి ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి సౌతాఫ్రికా టాప్ స్కోరర్ గా నిలిచిన బవుమా.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. నాలుగో రోజు మరో 69 పరుగులు చేయాల్సి ఉండగా.. బవుమా మ్యాచ్ గెలిపిస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
తొలి రెండు రోజులు హోరాహోరీగా సాగిన ఆటలో మూడో రోజు సఫారీ టీమ్ పూర్తిగా పైచేయి సాధించింది. ఓపెన్ ఐడెన్ మార్‌క్రమ్ (159 బాల్స్‌లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ టెంబా బవూమ (121 బాల్స్‌లో 5 ఫోర్లతో 65 బ్యాటింగ్) ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఆ జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మరో 69 రన్స్ దూరంలో నిలిచింది. ఛేజింగ్‌లో మూడో రోజు, శుక్రవారం చివరకు సౌతాఫ్రికా 213/2 స్కోరుతో నిలిచింది. మార్‌క్రమ్, బవూమ మూడో వికెట్‌కు అజేయంగా 143 రన్స్ జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపారు.
Temba Bavuma sustained a left hamstring strain before the tea break, but he will continue to bat
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
Live blog: https://t.co/L4rqQNY6Nc pic.twitter.com/JFziuj1N1z