మళ్లీ చలి గుప్పిట్లో తెలంగాణ

మళ్లీ చలి గుప్పిట్లో తెలంగాణ

హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. గత మూడ్నాలుగు రోజులుగా తగ్గినట్టే తగ్గిన చలి.. మళ్లీ పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. జనం చలి మంటలు వేసుకుని రిలీఫ్ పొందుతున్నారు. ఉదయం 8 గంటలైనా సూర్య కిరణాలు కనిపించడం లేదు. దీంతో వివిధ పనుల కోసం వాహనాలపై వెళ్లే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని రోజులు చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

ఢిల్లీని వణికిస్తున్న చలి

దేశ రాజధాని ఢిల్లీ వాసులను కరోనా, వాయు కాలుష్యంతో పాటు చలి తీవ్రత వేధిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇండియా గేట్ తో పాటు చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయం వాకింగ్ కు వెళ్లే వారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు ఈ సెలవులు వర్తిస్తాయి. సెలవుల్లో ఆన్ లైన్ తరగతులు కూడా ఉండవని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

మాస్క్ సరిగాపెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి

భారత్‌లోనే ఉంటా: పాక్ టెర్రరిస్ట్ భార్య

లైగర్ గ్లింప్స్: చాయ్వాలా టూ బాక్సర్