లైగర్ గ్లింప్స్: చాయ్వాలా టూ బాక్సర్

లైగర్ గ్లింప్స్: చాయ్వాలా టూ బాక్సర్

హైదరాబాద్: రౌడీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ మూవీ నుంచి అప్ డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందే షురూ చేశాడు విజయ్ దేవరకొండ. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ ను మూవీ యూనిట్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. 

‘లేడీస్ అండ్‌ జెంటిల్‌మేన్‌ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఎంఎంఏ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబై వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్‌, చాయ్‌ వాలా.. ది లైగర్‌’ అంటూ విజయ్‌ దేవరకొండను పరిచయం చేసే సన్నివేశాలతో ప్రారంభమైన గింప్స్‌లో ప్రతి సీన్‌ అదరగొట్టేలా సాగింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఛార్మి, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీ రోల్ పోషించారు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం: 

శబరిమల అయ్యప్ప దర్శనాలు షురూ

విశ్లేషణ: ఆడవాళ్లకు ఇంకెన్నాళ్లీ సంకెళ్లు

ముంబైలో మొదటి ఒమిక్రాన్ మరణం