చలి గుప్పిట ఢిల్లీ

చలి గుప్పిట ఢిల్లీ
  • చలి గుప్పిట ఢిల్లీ
  • రోజురోజుకూ పడిపోతున్న టెంపరేచర్లు
  • కొత్త ఏడాదిలో తొలి రోజు 5.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత
  • ఎల్లుండి నుంచి చలిగాలులు వీచే అవకాశం
  • రాజస్థాన్‌‌‌‌లోని ఫతేపూర్‌‌‌‌‌‌‌‌లో 1 డిగ్రీ ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ/జైపూర్: రోజురోజుకూ పడిపోతున్న టెంపరేచర్లతో ఢిల్లీ గజగజ వణుకుతున్నది. కొత్త ఏడాదిలో తొలి రోజైన ఆదివారం 5.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది రెండు డిగ్రీలు తక్కువ. పశ్చిమం నుంచి వీస్తున్న చల్లటి గాలులతోనే టెంపరేచర్లు పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ వారంలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, తర్వాత చలి గాలులు వీస్తాయని అంచనా వేశారు. సోమవారం 6 నుంచి 19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఉదయాన్నే దట్టమైన పొగ మంచు ఏర్పడుతుందని వివరించారు. మంగళవారం కూడా పొగమంచు ఢిల్లీని చుట్టేస్తుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోవచ్చని పేర్కొన్నారు. వచ్చే బుధవారం నుంచి శనివారం దాకా ఉష్ణోగ్రతలు 4 నుంచి 18 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. టెంపరేచర్లు 4 డిగ్రీలకు పడిపోవడమంటే.. చలిగాలులు మొదలవుతాయని అర్థమని, శనివారం దాకా కోల్డ్ వేవ్స్ కొనసాగుతాయని హెచ్చరించింది.  

గతంతో పోలిస్తే జరంత బెటర్

న్యూఇయర్ సమయంలో ఢిల్లీలో టెంపరేచర్లు పడిపోవడం సాధారణమే. గత పదేండ్లలో అతి తక్కువగా 2013 జనవరి 6న 1.9 డిగ్రీలకు ఢిల్లీ ఉష్ణోగ్రత పడిపోయింది. తర్వాతి ఏడాది జనవరి 1న 2 డిగ్రీలు నమోదైంది.

ఏక్యూఐ తగ్గింది..

ఆదివారం ఉదయం పశ్చిమ గాలుల కారణంగా ఎయిర్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ ఇండెక్స్ కాస్త మెరుగుపడింది. అంతకుముందు దాకా ఏక్యూఐ ‘వెరీ పూర్ కేటగిరీ’లో ఉండింది. అయితే ఆదివారం ఉదయానికి ఇది 264 (పూర్ కేటగిరీ)గా నమోదైంది.

బొగ్గు వాడకంపై బ్యాన్!

ఇండస్ట్రీలు, వాణిజ్య సంస్థల్లో బొగ్గు, ఇతర పర్మిషన్‌‌‌‌ లేని ఇంధనాల వాడకంపై కఠినమైన నిషేధం ఆదివారం నుంచి ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌‌‌‌లో అమల్లోకి వచ్చింది. ఈ రూల్ పాటించని వాటిని ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు.

రాజస్థాన్‌‌‌‌లోనూ పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాజస్థాన్‌‌‌‌లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. శనివారం రాత్రి అతి తక్కువగా సికర్ జిల్లాలోని ఫతేపూర్‌‌‌‌‌‌‌‌లో 1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. చురులో 1.6 డిగ్రీలు నమోదయ్యాయి. హనుమాన్‌‌‌‌గఢ్‌‌‌‌, చిత్తోర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌లో 3.3 డిగ్రీల చొప్పున, సికర్‌‌‌‌‌‌‌‌లో 3.5, బిల్వారాలో 4 డిగ్రీలు, కరౌలీలో 4.2 డిగ్రీలు రికార్డయ్యాయి.