నిర్మల్ జిల్లాలో చేపల పట్టేందుకు వెళ్లి యువకుడు గల్లంతు

నిర్మల్ జిల్లాలో చేపల పట్టేందుకు వెళ్లి యువకుడు గల్లంతు
  • నిర్మల్ జిల్లా పొన్కల్  సదర్ మట్ బ్యారేజ్ వద్ద ఘటన  

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సమీపంలోని సదర్ మట్ మినీ బ్యారేజ్ లో చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల తెలిపిన ప్రకారం.. పొన్కల్ కు చెందిన   పల్లికొండ సిద్దు(19) గురువారం సదర్ మట్ బ్యారేజ్ వద్ద చేపల వేటకు వెళ్లాడు. 

 ప్రమాదవశాత్తు బ్యారేజ్ పై నుంచి నీటిలో పడి గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.