మంత్రి అల్లోలపై యాదాద్రి ఈఓ గీతారెడ్డి అసంతృప్తి

మంత్రి అల్లోలపై యాదాద్రి ఈఓ గీతారెడ్డి అసంతృప్తి

Indrakaran Reddy : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిపై ఆలయ ఈఓ గీతారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడుల్లా చాలామందిని తీసుకుని రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ మంత్రి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. ‘అందరు అయిపోయిరు.. అందరు అయిపోయిరు’ అంటూ సమాధానం చెబుతూ ముందుకు నడిచారు. ఈ సమయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పక్కనే, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. 

మార్చి 18వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.