చెన్నైలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

చెన్నైలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

చెన్నై నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకేరోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పదిచోట్ల స్నాచింగ్ లకు పాల్పడ్డారు. షెంగెట్టమాల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఒంటరి మహిళ మెడలోంచి చైన్ ను లాక్కెళ్లారు దుండగులు. బైక్ పై వెనక నుంచి వచ్చి స్నాచింగ్ కు పాల్పడ్డారు. మరోచోట ఇంటి నుంచి పెళ్లి వెళ్తున్న మహిళ మెడలోంచి చైన్ ను లాగేందుకు ప్రయత్నించారు…అయితే మహిళ అప్రమత్తమై అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వీటితో పాటు రాయపేట, తిరువల్లికేని, మైలాపురం, కొడుంగయూర్, ఆడం బాక్కం, ప్రాంతాల్లో చైన్ దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. సీసీ ఫుటేజీల ఆధారం దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.