ఇంటి యజమానురాలిని చంపిన కిరాయిదారుడు

ఇంటి యజమానురాలిని చంపిన కిరాయిదారుడు

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. హస్మత్ పేట్‌లోని సత్యసాయి ఎంక్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని మంగతాయారు అనే 72 ఏళ్ల వృద్దురాలని.. ఇంట్లో రెంట్‌కు ఉంటున్న వ్యక్తే హత్య చేశాడు. వృద్దురాలని మర్డర్ చేసి డెడ్ బాడీని బాత్ రూంలో దాచాడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించక పోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదట మంగతాయారు ఇంట్లోనే వెతికారు. ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ పోర్షన్‌లోని  బాత్రూమ్‌లో మంగతాయారు మృతదేహం దొరికింది. మంగతాయారు‌ను బాత్రూమ్‌లోకి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురిచేసిన తర్వాత సురేష్  అతి కిరాతకంగా హత్యచేశాడు. నిందితుడు సురేష్‌ని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.