బీఆర్ఎస్ మీటింగ్ లో ఉద్రిక్తత.. కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ ఆవేదన

బీఆర్ఎస్ మీటింగ్ లో ఉద్రిక్తత.. కార్యకర్తలకు గుర్తింపు లేదంటూ ఆవేదన

కరీంగనర్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ కరీంనగర్ నియోజకవర్గ సమావేశంలో కామారపు శ్యామ్ ఆనే కార్యకర్త ఆందోళన చేశారు. పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్న కార్యకర్తలకు గుర్తింపులేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ప్రజాప్రతినిధులకే విలువ ఇచ్చి కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని చెప్పారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకోసమే ఈ మీటింగులు అంటూ అగ్ర నాయకుల పై ఫైర్ అయ్యారు. చివరకు తోటి కార్యకర్తలు కలగ చేసుకుని శ్యామ్ ను శాంతింప చేశారు.