షర్మిల పాదయాత్రలో భారీగా పోలీసులు

షర్మిల పాదయాత్రలో భారీగా పోలీసులు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములు నాయక్ తండా నుంచి షర్మిల 223వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అయితే షర్మిల యాత్రను అడ్డుకుంటారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  పాదయాత్రలో భారీగా పోలీసులు మోహరించారు.

రాములు నాయక్ తండా నుంచి మొదలైన షర్మిల  పాదయాత్ర.. మకుదంపూర్, చెన్నారావు పేట, ఖాదర్ పేట, ఖాదర్ పేట క్రాస్ రోడ్, జాలిశంకరమ్మ తండా, లింగగిరి, నెక్కొండ గ్రామాల మీదుగా కొనసాగనుంది.  సాయంత్రం 4.30గంటలకు నెక్కొండ మండల కేంద్రంలో ప్రజలతో షర్మిల మాట -ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.