ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఉద్రిక్తత

V6 Velugu Posted on Sep 15, 2021

ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయాలని అడిగినందుకు లాఠీచార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత యువకులు. మూడేళ్ళ క్రితం మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను నిలదీశారు దళితులు. ఎమ్మెల్యే అండతో సీఐ పురుషోత్తం తమను కొట్టారని ఆరోపిస్తున్నారు యువకులు. సీఐ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు స్థానిక ప్రజా ప్రతినిధులు.

Tagged tension, Adilabad, construction , SC community hall, Talamadugu

Latest Videos

Subscribe Now

More News