గుండె ఆపరేషన్ చేసిన గంటకే పేషెంట్ మృతి..

గుండె ఆపరేషన్ చేసిన గంటకే పేషెంట్ మృతి..
  • యశోద దవాఖాన ఎదుట ఆందోళన  
  • హాస్పిటల్​ అద్దాలు ధ్వంసం 
  • డబ్బులు కట్టించుకున్నాకచనిపోయాడని చెప్పారంటూ ఫైర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు : సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో హార్జ్​సర్జరీ చేయించుకున్న వ్యక్తి కొద్దిసేపటికే చనిపోవడంతో, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు ఆగ్రహానికి గురై హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..

వెంగళ్​ రెడ్డి అనే వ్యక్తి  ఈ నెల మూడో తేదీన గుండె సంబంధిత సమస్యతో సోమాజిగూడ యశోద హాస్పిటల్​లో చేరగా, ఐదో తారీఖున ఆపరేషన్​ చేశారు. సర్జరీ తర్వాత ఆపరేషన్​సక్సెస్​అయ్యిందని, పెండింగ్​డబ్బులు కట్టించుకున్నారు. గంట సేపటికే వెంగళ్​రెడ్డి చనిపోయాడని బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. 

సర్జరీ బాగానే జరిగిందని చెప్పారని,  అంతలోనే ఎలా చనిపోతాడని హాస్పిటల్​ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఒక దశలో  హాస్పిటల్​అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులతో మాట్లాడి సర్ధి చెప్పి పంపిచారు.