
శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి రూపొందించిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు, రవితేజ మన్యం నిర్మించారు. జూన్ 24న విడుదలవ్వాల్సిన ఈ సినిమాని జులై 1కి వాయిదా వేసినట్టు నిన్న ప్రకటించారు మేకర్స్. జూన్ 24న మరో నాలుగైదు చిత్రాలు విడుదల అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రామారావు మాట్లాడుతూ ‘డిగ్రీలు, పీజీలు చేసినా.. ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజులు మర్చిపోలేనివి. అందర్నీ ఆ రోజుల్లోకి తీసుకెళ్తుందీ సినిమా’ అన్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివ బాలాజీ, మధుమిత, సత్యం రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.