అక్టోబర్ 30 నుంచి టెన్త్ ఎగ్జామ్ ఫీజు.. నవంబర్11 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్

అక్టోబర్ 30 నుంచి టెన్త్ ఎగ్జామ్ ఫీజు.. నవంబర్11 వరకు ఫీజు చెల్లించేందుకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజుల షెడ్యూల్​ను ప్రభుత్వ పరీక్షల విభాగం  రిలీజ్ చేసింది. అక్టోబర్  30 నుంచి నవంబర్ 11 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. 

రూ.50 ఫైన్​తో నవంబర్ 15- 25 వరకు, రూ.200 ఫైన్​తో నవంబర్ 29 - డిసెంబర్ 12 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 -నుంచి 29 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని ప్రకటించారు.  ఇదే షెడ్యూల్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ రాయబోయే విద్యార్థులకూ వర్తించనున్నదని చెప్పారు.