స్ట్రీట్​లైట్స్​ ఆటో  స్విచ్​ కనుగొన్న టెన్త్​ స్టూడెంట్​

స్ట్రీట్​లైట్స్​ ఆటో  స్విచ్​ కనుగొన్న టెన్త్​ స్టూడెంట్​

శభాష్​ .. శశిధర్

అన్ని జీపీల్లో ఏర్పాటుకు కలెక్టర్​ ఆదేశాలు

మహాముత్తారం, వెలుగు: జయశంకర్ ​భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్​ టీఎస్ మోడల్ స్కూల్ స్టూడెంట్​ఎదులాపురం శశిధర్ తయారు చేసిన స్ట్రీట్ లైట్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ పరికరాన్ని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించి ప్రపోజల్స్​రెడీ చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ మహాముత్తారం ఎంపీడిఓ ఆంజనేయులును ఆదేశించారు. టెన్త్​స్టూడెంట్​ శశిధర్ సోమవారం కలెక్టర్ ఆఫీస్​లో కలెక్టర్ ను కలిశారు. తాను తయారు చేసిన ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ స్ట్రీట్ లైట్ పరికరం, ఆటోమేటిక్ శానిటైజర్, వాటర్ లెవెల్ ఇండికేటర్, లో కాస్ట్ ఇన్వర్టర్, వైర్లెస్ టెస్టర్ తదితర పరికరాలను చూపించి.. వాటి పనితీరును వివరించారు.  మారుమూల ఎలాంటి సపోర్టు లేని ఏరియాలో ఉంటూ తక్కువ ఖర్చుతో ఎఫెక్టవ్​గా పని చేసే పరికరాలను తయారు చేయడం అద్భుతమని కలెక్టర్​ శశిధర్​ను అభినందించారు. శశిధర్​ ప్రయోగాలను మరింత సమర్థంగా కొనసాగించేందుకు తెలంగాణ మోడల్ స్కూల్ లో సైన్స్ ప్రాజెక్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శశిధర్​వెంట ఫిజిక్స్​ టీచర్​ రాజేంద్రప్రసాద్​ ఉన్నారు.

For More News..

ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్