మంచు ఎఫెక్ట్ తో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

మంచు ఎఫెక్ట్ తో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.వాహనదారులు రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కనీసం రహదారి కనిపించనంత  విధంగా మంచు విపరీతంగా కురుస్తోంది. మంచు కారణంగా పెన్సిల్వేనియా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి కనిపించకపోవడంతో భారీ ట్రక్కులు, ట్రాక్టర్లు, కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.దాదాపు 50 నుంచి 60 వాహనాలు రోడ్డుపై ఢీకొన్నాయని చెబుతున్నారు పోలీసులు.మంచుతో కూడిన రహదారిపై నియంత్రణ కోల్పోవడంతో వాహనాలు ఒకదానికొక్కటి ఢీకొన్నాయంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన