మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయి.. కశ్మీర్ నాశనమయ్యింది.. పహల్గాం దాడి ప్రభుత్వ వైఫల్యమే: కాంగ్రెస్

మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయి.. కశ్మీర్ నాశనమయ్యింది.. పహల్గాం దాడి ప్రభుత్వ వైఫల్యమే: కాంగ్రెస్

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తింది. మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయని.. కశ్మీర్ నాశనమైందని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఈ సందర్భంగా అన్నారు. ఆపరేష్ సిందూర్ పై కేంద్ర ప్రభుత్వం నిజాలు దాస్తోందని.. నిజాలు చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. . 

ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఇచ్చామని.. కానీ సీజ్ ఫైర్ కు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో PoK ను ఆక్రమించుకునే ఛాన్స్ కోల్పోయామని అన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలు:

  • ఆపరేషన్ సిందూర్ పై చర్చను రక్షణ మంత్రి పక్కదారి పట్టిస్తున్నారు
  • మోదీ పాలనలో జమ్మూ కశ్మీర్ నాశనమైంది
  • కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు
  • ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ సురక్షితం అని చెప్పారు
  • కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు
  • ఆపరేషన్ సిందూర్ పై ప్రభుత్వానికి సంపూర్ణ మద్ధతిచ్చాం
  • మోదీ సర్కార్ ఎందుకు సీజ్ ఫైర్ కు ఒప్పుకుంది
  • వంద రోజులైనా ఎందుకు స్పందించలేదు
  • ఉగ్రవాదులు దాడి తర్వాత ఎలా పారిపోయారు
  • పహల్గాం ఉగ్రదాడి తర్వాత సౌదీ నుంచి వచ్చిన మోదీ బీహార్ వెళ్లారు
  • మోదీకి దేశ రక్షణ కంటే పాలిటిక్స్ ముఖ్యం
  • 2016 తర్వాత ఉగ్రదాడులు ఉండవని చెప్పారు
  • మోదీ అసమర్థ పాలనతోనే ఉగ్రదాడులు పెరిగాయి
  • భారత జెట్స్ కూలాయని సింగపూర్ లో సీడీఎస్ (చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్) ఒప్పుకున్నారు
  • షంగ్రిలా డైలాగ్ పై సీడీఎస్ చెప్పిన మాటలు నిజం కావా..?
  • ఒక్కో జెట్ కోట్లు ఖర్చు చేశాం
  • విదేశాంగ విధానం పూర్తిగా అట్టర్ ఫ్లాప్
  • ఆపరేషన్ సిందూర్ పై  కేంద్రం నిజాలు దాస్తోంది
  • ఆపరేషన్ సిందూర్ పై మోదీ ప్రభుత్వం నిజాలు చెప్పాలి
  • ఆపరేషన్ సిందూర్ పై నిజాలు చెప్పేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం
  • కేంద్ర ప్రభుత్వానికి అహంకారం పెరిగిపోయింది
  • ఎంత పెద్ద తప్పు జరిగినా ఏం జరగలేదన్నట్లు బుకాయిస్తోంది.
  • PoK ను స్వాధీనం చేసుకునే మంచి అవకాశం కోల్పోయాం
  • మోదీ పాలనలో త్రిఫ్రంట్ యుద్ధానికి పునాదులు
  • బంగ్లాదేశ్ తో బంధం పూర్తిగా దెబ్బతింది
  • పాక్ కు ఐఎంఫ్ సాయం ఆపడంలో భారత్ విఫలం
  • ఏడీబీ, ప్రపంచ బ్యాంకునుంచి పాక్ కు నిధులు వెళ్తూనే ఉన్నాయి