ఐఎస్ టెర్రర్‌‌ గ్రూప్‌లో 66 మంది ఇండియన్లు

ఐఎస్ టెర్రర్‌‌ గ్రూప్‌లో 66 మంది ఇండియన్లు

వాషింగ్టన్: గ్లోబల్ టెర్రరిజం గ్రూప్ ఐఎస్​లో 66 మంది ఇండియన్లు ఉన్నారని అమెరికా వెల్లడించింది. టెర్రరిజానికి సంబంధించి 2020 రిపోర్టును గురువారం విడుదల చేసింది. కౌంటర్ టెర్రరిజంలో మన దేశ బలగాలు బాగా పనిచేస్తున్నాయని మెచ్చుకుంది. టెర్రరిస్టు యాక్టివిటీలను ముందుగానే గుర్తించి, వాటిని అడ్డుకుంటున్నాయని చెప్పిం ది. కాగా, పాకిస్తాన్ అడ్డాగానే టెర్రరిస్టు సంస్థ లు ఇండియాపై దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టంచేసింది. ఆ గ్రూపులపై పాక్ చర్యలు తీసుకోవడంలేదని మండిపడింది. ‘అఫ్గాన్​ను టార్గెట్ చేసుకొని అఫ్గాన్ తాలిబాన్, హక్కానీ నెట్ వర్క్ దాడు లు చేస్తున్నాయి. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్ గ్రూపులు పాక్ కేంద్రంగా ఇండియాపై దాడులు చేస్తున్నాయి’ అని పేర్కొంది.