న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ లోని బుడ్గాంలో శుక్రవారం ఇద్దరు వలస కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ఇద్దరు గాయపడ్డారు. బాధితులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని డాక్టర్లు తెలిపారు. ఆ వలస కార్మికులను ఉత్తరప్రదేశ్ కు చెందినవారుగా గుర్తించారు.
కాగా.. కాశ్మీర్ లో వలస కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడం గత రెండు వారాల్లో ఇది నాలుగోసారి. గత నెల 20న బిహార్ కు చెందిన ఏడుగురు కార్మికులను గందేర్బాల్ జిల్లాలో ముష్కరులు కాల్చి చంపారు.