
- టెట్ క్వాలిఫైడ్ టీచర్ల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లలో ఎన్సీటీఈ గైడ్లైన్స్ అమలు చేయాలని టెట్ క్వాలిఫైడ్ టీచర్లు సర్కారును కోరారు. ఈ మేరకు వారు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం టీచర్లు మాట్లాడుతూ..ప్రమోషన్లపై ఎలాంటి స్టే లేదని తెలిపారు. ఎన్సీటీఈ గైడ్ లైన్స్ అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దీన్ని అమలు చేస్తూ టెట్ క్వాలిఫైడ్ అయిన 33వేల మంది టీచర్లకు న్యాయం చేయాలని కోరారు.