
భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అయింది. ఆదివారం (మే25) కురిసిన వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తెల్లవారు జామునుంచి కురుస్తు్న్న వర్షాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 పైకప్పు కూలిపోయింది. ఎయిర్ పోర్టు టర్మినల్ కూలిపోవడంపై కాంగ్రెస్ నేతలు సెటైరికల్ గా స్పందించారు. వికసిత్ భారత్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో విపరీతంగా వికసించింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు.
Vikas overflows in Delhi Airport after a drizzle. pic.twitter.com/BP7bA5QaGV
— Congress Kerala (@INCKerala) May 25, 2025
శనివారం అర్థరాత్రి నుంచి భారీవర్షాలు దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తాయి. తెల్లవారుజామున 2గంటలసమయంలో దాదాపు 45 నిమిషాలపాటు 70నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలివాన నగరాన్ని అతలాకుతలం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా 8సెం.మీలకంటే ఎక్కువ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షాలతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు చుట్టూ నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద పైకప్పులో కొంత భాగం ఆదివారం తెల్లవారుజామున భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా కూలిపోయింది. ఎయిర్ పోర్టు వెలుపల ఉన్న ఓవర్‌హాంగ్ కాలిబాటపైకి విరిగిపడింది. ఎయిర్ పోర్టులో నీరు ప్రవహించిన దృశ్యాలకు సంబంధించి ఫోటోలు,వీడియోలు వైరల్ అవుతున్నాయి.భారీ వర్షం కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. వర్షం కారణంగా 17 అంతర్జాతీయ విమానాలు సహా 49 విమానాలను దారి మళ్లించారు.