ఉత్తరాఖండ్​:బద్రీనాథ్ హైవేపైవిరిగిపడిన కొండచరియలు .. 6 కి.మీ ట్రాఫిక్ జామ్

ఉత్తరాఖండ్​:బద్రీనాథ్ హైవేపైవిరిగిపడిన కొండచరియలు .. 6 కి.మీ ట్రాఫిక్ జామ్

ఉత్తరాఖండ్​ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  బద్రీనాథ్​ హైవే (NH 7) కొండచరియలు విరిగిపడడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్థంభించింది.  పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.  రెస్క్యూ టీమ్స్​ జేసీబీలతో విరిగిపడిప కొండచరియల శిథిలాలను తొలగిస్తున్నారు.  

గూగుల్ లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్ ప్రకారం..సాయంత్రం 4 గంటల ప్రాంతంలో  అలకనంద నది ఒడ్డున ఉన్న ధరి దేవి ఆలయానికి  ఆరు కిలోమీటర్ల దూరంలో  ఖంక్ర రహదారిపై  వాహనాలు బారులు తీరాయి. ఇది
 రిషికేశ్... దేవ్‌ప్రయాగ్... రుద్రప్రయాగ్... కర్ణప్రయాగ్...చమోలి, జోషిమత్ .. బద్రీనాథ్ వంటి అనేక పుణ్యక్షేత్రాలను కలిపే కీలక మార్గం.

ALSO READ | ఢిల్లీలో భారీ వర్షాలు..కూలిన ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ పైకప్పు..విమానాలు దారిమళ్లింపు

ధరీ దేవి ఆలయం శ్రీనగర్ (ఉత్తరాఖండ్) ...  రుద్రప్రయాగ్ మధ్య ఉంది.  జాతీయ రహదారి నెంబరు 7  అలకనంద నది పక్కన ఉంది.  కొంతమంది పర్యాటకులు ట్విట్టర్​లో ట్రాఫిక్​ జాం అయిన ఫొటోలను పోస్ట్​  చేశారు.

  మే 27 వరకు పశ్చిమ .. తూర్పు రాజస్థాన్‌లో దుమ్ము తుఫానులు, హిమాచల్ ప్రదేశ్.. ఉత్తరాఖండ్‌లలో వడగళ్ళు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.