బీఈడీలో 9,955 మందికి సీట్లు..సెట్స్ కన్వీనర్  వెల్లడి

బీఈడీలో 9,955 మందికి సీట్లు..సెట్స్ కన్వీనర్  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎడ్ సెట్ ఫస్ట్ ఫేజ్  సీట్ల అలాట్ మెంట్  పూర్తయింది. మొత్తం 9,955 మందికి సీట్లు అలాట్  అయ్యాయి. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో కన్వీనర్  కోటా కింద 14295 సీట్లు ఉండగా.. 17,151 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.  వీరిలో 9955 మందికి సీట్లు అలాట్  చేశామని సెట్స్  కన్వీనర్  ప్రొఫెసర్  పాండురంగారెడ్డి తెలిపారు.

సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 14లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఓ ప్రకటనలో ఆయన సూచించారు. అత్యధికంగా బీసీ–బీ కేటగిరిలో 1823 మంది, బీసీ–డీలో 1619 మందికి, ఎస్సీ గ్రూప్2లో 1548 మందికి, ఎస్టీలో 1368 మందికి సీట్లు అలాట్  చేశారు.