
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ పైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండగా, 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఆగస్టు10లోగా సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. మరిన్ని వివరాలకు https://tgeapcet.nic.in వెబ్ సైట్ చూడాలని అధికారులు సూచించారు. కాగా, ఎప్ సెట్ రెండో విడతలో 82,521 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. దీంతో కొత్తగా వచ్చిన సీట్లతో కలిపి 16,500 సీట్లు స్టూడెంట్లకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.