టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్‎గా అపోలో టైర్స్.. భారీ ధరకు దక్కించుకున్న టైర్ల కంపెనీ

టీమిండియా కొత్త టైటిల్ స్పాన్సర్‎గా అపోలో టైర్స్.. భారీ ధరకు దక్కించుకున్న టైర్ల కంపెనీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‎ షిప్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకుంది. 2027 వరకు టీమిండియా టైటిల్ స్పాన్సర్‎గా అపోలో టైర్స్ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అగ్రిమెంట్‎లో భాగంగా బీసీసీఐకి ఒక్క మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు చెల్లించనుంది అపోలో టైర్స్ కంపెనీ. గత టీమిండియా టైటిల్ స్పాన్సర్ డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‎కు బీసీసీఐకి రూ.4 కోట్ల చెల్లించేంది. అపోలో టైర్స్ మాత్రం డ్రీమ్11 కంటే మరో రూ.50 లక్షలు అదనంగా చెల్లించనుంది. 2026లో టీ20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్న దృష్ట్యా టీమిండియా టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులు అపోలో టైర్స్ బ్రాండ్‎ను మరింత పెంచనుంది. 

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్11కు బీసీసీఐ గుడ్ బై చెప్పింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దేశంలో రియల్ మనీ గేమింగ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో రియల్ మనీ గేమింగ్ యాప్ అయిన డ్రీమ్ 11తో బీసీసీఐ సంబంధాలు తెంచుకుంది. లీడ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి డ్రీమ్11 తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌‌ వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా 2025, సెప్టెంబర్ 3న ఇండియన్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ టైటిల్‌‌ స్పాన్సర్‌‌షిప్‌‌ కోసం బీసీసీఐ బిడ్స్‌‌ను ఆహ్వానించింది. 

ALSO READ : షేక్ హ్యాండ్ వివాదం: పాకిస్తాన్కు ఎదురుదెబ్బ.. పాక్ డిమాండ్ను కొట్టి పారేసిన ఐసీసీ

బిడ్స్‌‌ను దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 16ను చివరి తేదీగా పేర్కొంది. హాయొస్ట్ బిడ్‎తో దేశంలో ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ టీమిండియా లీడ్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టం ప్రకారం డ్రీమ్ 11తో ఉన్నఫలంగా ఒప్పందం రద్దుకావడంతో ఆసియా కప్ 2025లో టీమిండియా తమ జెర్సీలపై స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళల జట్టు కూడా స్పాన్సర్ లేకుండానే ఆడుతోంది.